: క్లిష్ట పరిస్థితుల్లో కష్టపడి పని చేస్తా: సల్మాన్ ఖాన్
క్లిష్ట సమయాల్లో కష్టపడి పని చేస్తానని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. 'రాజశ్రీ' ప్రొడక్షన్స్ నిర్మించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో చాలా కష్టాలు పడ్డానని అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టపడి పని చేశానని సల్మాన్ చెప్పాడు. నిజ జీవితంలో కూడా తన పరిస్థితి ఎప్పుడూ చాలా క్లిష్టంగా ఉంటుందని సల్లూ భాయ్ తెలిపాడు. అందుకే సినిమాల్లో ఎప్పటికీ కష్టపడి పనిచేస్తూనే ఉంటానని సల్మాన్ చెప్పాడు. కాగా, ఈ సినిమాలో సల్మాన్ సరసన సోనమ్ కపూర్ నటిస్తుండగా, సూరజ్ బరజాత్య దర్శకత్వం వహిస్తున్నాడు.