: జైల్లో ఉంటూనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ...!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరస్తులు బాగానే పోటీపడుతున్నారు. అలాంటి వ్యక్తే అనంత్ సింగ్ కూడా. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంత్ సింగ్ గత జూన్ లో కిడ్నాప్, హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టు అనుమతితో త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొకామా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 7న ఆయన నామినేషన్ వేయనున్నట్టు అనుచరులు చెప్పారు. కండబలం, ఆర్థికబలంతో బీహార్ రాజకీయాల్లో తనదైన హవా చూపిన అనంత్ సింగ్ మొన్నటివరకు జేడీయూలో ఉన్నారు. పార్టీ టికెట్ నిరాకరించడంతో రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా బరిలో దిగుతున్నారు.