: పేదోడి గుండెల్లో వైఎస్ సజీవంగా ఉన్నారు!: షర్మిల


రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇచ్చింది, పేదోడి గుండెల్లో సజీవంగా ఉన్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పరామర్శ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ ఆశయాలను బతికించుకుందామని, రాజన్న రాజ్యం సాధించుకుందామని ఆమె అన్నారు. వైఎస్ఆర్ బతికుంటే రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదని, పేదలకు ఇళ్లు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేవని, ఆశా వర్కర్లందరిని క్రమబద్ధీకరించేవారని షర్మిల అన్నారు. ఈ యాత్రలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News