: గవర్నర్ తో కేసీఆర్ భేటీ


ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా, వీరిరువురూ పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం కూడా రెండున్నర గంటల పాటు గవర్నర్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ ఉదయం కూడా గాంధీ జయంతి సందర్భంగా ఇరువురూ కలసి మహాత్ముడికి నివాళి అర్పించారు. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో, వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News