: ముంబై రియల్టీ రికార్డులను బద్దలుకొట్టిన ‘ఎలాంటే మాల్’... రూ.1,785 కోట్లకు విక్రయం


భారత్ రియల్టీ రంగం తిరోగమిస్తోందన్న ఆర్థిక రంగ నిపుణుల అంచనాలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధమే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో వరుసగా నమోదవుతున్న కొనుగోళ్లు చూస్తే... ఆర్థిక నిపుణులకే కాక మనకూ షాక్ తప్పదు. ఛండీగఢ్ లోని ‘ఎలాంటే మాల్’ ను ముంబైకి చెందిన ‘కార్నివాల్ గ్రూప్’ కొనుగోలు చేసింది. ఇందులో ఆశ్చర్యమేముందంటారా? ధర చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే సుమా. ఈ మాల్ కోసం కార్నివాల్ గ్రూప్ ఏకంగా రూ.1,785 కోట్లను వెచ్చించింది. తద్వారా భారత్ రియల్టీ రంగంలో అత్యధిక విలువ పెట్టి ఆస్తులు కొన్న సంస్థగా ‘కార్నివాల్ గ్రూప్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ముంబై రియల్టీలో రెండు రోజుల క్రితం రూ.1,480 కోట్లు చెల్లించి బీకేసీలోని ఆఫీస్ స్పేస్ ను ‘అబాట్ ఇండియా’ కొనుగోలు చేసింది. నిన్నటిదాకా ఇదే రికార్డు. అబాట్ ఇండియా రికార్డును ‘కార్నివాల్ గ్రూప్’ ఒకే ఒక్క రోజులో చెరిపేసింది. అయినా ‘ఎలాంటే మాల్’లో ఏమేం ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తే... 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ మాల్ లో హయత్ లగ్జరీ హోటల్ తో పాటు 15 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, ఎనిమిది తెరల మల్టీప్లెక్స్, డిపార్ట్ మెంటల్ స్టోర్లు, స్పోర్ట్స్ బార్, అన్ని ప్రముఖ సంస్థల ఉత్పత్తులతో కూడిన హైపర్ మార్కెట్ కూడా ఉందట. అంతేకాక దేశ రాజధాని ప్రాంతం ‘ఎన్సీఆర్’ను మినహాయిస్తే ‘ఎలాంటే మాల్’ అంత భారీ భవంతి అసలు ఉత్తర భారతంలోనే లేదట.

  • Loading...

More Telugu News