: ఇకపై ఖైరతాబాద్ గణేష్ లడ్డూ పంపిణీ నిలిపేస్తాం: డీసీపీ
ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో, భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీలకు పని కల్పించారు. ఈ క్రమంలో, ఓ భక్తుడికి తల కూడా పగిలింది. ఈ నేపథ్యంలో, డీసీపీ కమలాసన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై, గణేష్ లడ్డూ పంపిణీని అనుమతించమని, నిలిపివేస్తామని చెప్పారు. గణేష్ లడ్డూ కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని, దీంతో తొక్కిసలాట జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇకపై లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయకుండా, నిర్వాహకులతో మాట్లాడతామని చెప్పారు.