: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి బదిలీ అయ్యారు. సర్వే సెటిల్ మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా జి.వాణిమోహన్, మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీగా పి.ఉషా కుమారి, సీఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా ప్రసన్న వెంకటేష్ నియమితులయ్యారు. ఇక సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా డా.వి.వి రమణమూర్తిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.