: చైన్ స్నాచింగ్ ముఠాకు అరదండాలు...ఆరుగురి అరెస్ట్, కిలోకు పైగా బంగారం సీజ్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో చైన్ స్నాచర్లు స్వైర విహారం చేస్తున్నారు. స్నాచర్ల చేతివాటంతో ఒంటరిగా బయటకు వచ్చేందుకు మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ముమ్మర తనిఖీలు మొదలెట్టిన హైదరాబాదు నగర పోలీసులు ఎట్టకేలకు చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టేశారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై తెలంగాణతో పాటు మహారాష్ట్రలో 30కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.