: పరారీలో గాలి జనార్దన్ రెడ్డి... వేట మొదలెట్టిన సిట్ బృందాలు


కన్నడనాట మరో బ్రేకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇనుప ఖనిజం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారట. లోకాయుక్త ఆదేశాలతో తనను అరెస్ట్ చేసేందుకు సిట్ బృందాలు రంగంలోకి దిగాయని తెలుసుకున్న ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు లోకాయుక్త నుంచి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కోసం వారెంట్లు పొందిన సిట్ 8 బృందాలను రంగంలోకి దించింది. ఎలాగైనా నేటి సాయంత్రంలోగా అరెస్ట్ చేయాలని భావిస్తున్న సిట్, ఆయన కోసం బళ్లారి సహా బెంగళూరును జల్లెడ పడుతోంది. ఇప్పటికే ఓ మారు అరెస్ట్ అయ్యి విచారణ ఎలా ఉంటుందో రుచి చూసిన జనార్దన్ రెడ్డి స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అయితే ఆయన లొంగుబాటును ఎలాగైనా అడ్డుకోవాలని సిట్ యత్నిస్తోంది. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఎవరు విజయం సాధించినా గాలి మరోమారు కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమే.

  • Loading...

More Telugu News