: మహాత్మాగాంధీ ఎలాంటి ఆహారం తీసుకునేవారో తెలుసా?


మహాత్ముడిగా, జాతిపితగా, అహింసకు ప్రపంచ రాయబారిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన పూజ్య బాపూజీ తాను ఏదైతే చెప్పేవారో, దాన్నే తాను కూడా ఆచరించేవారు. మనుషులుగా జన్మించిన మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. మనిషి మాంసాహారం తీసుకునే జంతువు కాదని, భూమిపై పెరిగే పండ్లు, కాయగూరల ద్వారా ఆకలిని తీర్చుకోవాలని ఆయన చెప్పేవారు. స్వతహాగా తన ఆహారం విషయంలో ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు. మహాత్ముడు రచించిన పుస్తకాల ప్రకారం, ఆహారం విషయంలో ఆయన చాలా క్రమశిక్షణతో ఉండేవారు. బ్రౌన్ రైస్ లో దాల్, కాయగూరలు ఆహారానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పళ్లను తీసుకునేవారు. సీజనల్ గా వచ్చే ఫలాలను అందరూ తినాలని ఆయన సూచించేవారు. అలాగే, మేక పాలను ఆయన తీసుకునేవారు. పచ్చి పళ్లు, పచ్చి కాయగూరల్లో ఎక్కువ న్యూట్రిషనల్ బెనెఫిట్స్ ఉంటాయని భావించేవారు. తియ్యదనం కోసం పంచదార కంటే బెల్లానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

  • Loading...

More Telugu News