: నిన్న నిమ్మకాయల, నేడు కేఈ... వరుసగా ఏపీ డిప్యూటీ సీఎంల బర్త్ డే!


నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి... ఇద్దరూ టీడీపీ సీనియర్ నేతలే. చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, కేఈ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ రెండు సామాజిక వర్గాలు ఏపీలో బలమైనవే. ఈ రెండు సామాజిక వర్గాల వల్లే తాను మళ్లీ అధికారంలోకి వచ్చానని పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ కారణంగానే ఆ రెండు సామాజికవర్గాల ప్రతినిధులుగా వారిద్దరికి చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టారు. వీరిలో చినరాజప్ప హోంశాఖ తీసుకోగా, కేఈ చేతి కింద కీలకమైన రెవెన్యూ శాఖ ఉంది. డిప్యూటీ సీఎంలు ఉన్న వీరిద్దరి మధ్య మరో అంశంలోనూ ఆసక్తికర సారూప్యం ఉంది. అదేంటంటే, వరుస రోజుల్లో ఇద్దరి జన్మదినాలు ఉండటమే. నిన్న చినరాజప్ప జన్మదినం సందర్భంగా విజయవాడలో చంద్రబాబు స్వయంగా ఆయన చేత కేక్ కట్ చేయించి తినిపించారు. తాజాగా నేడు కేఈ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News