: బాపూజీ, శాస్త్రిలకు నివాళి అర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సోనియా


బాపూజీ 146వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. అలాగే, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి అంజలి ఘటించారు. శాస్త్రి జయంతి కూడా నేడే. నివాళి అర్పించిన వారిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఉన్నారు. ఘాట్ వద్ద పుష్పాలను ఉంచి వీరు అంజలి ఘటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన 'అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా' జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News