: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీలో చంద్రబాబు... విద్యార్థుల్లో ఉత్తేజం నింపిన ఏపీ సీఎం


జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బయటకొస్తే అడుగడుగునా ఆంక్షలు తప్పనిసరి. అలాంటిది కొద్దిసేపటి క్రితం చంద్రబాబు స్వయంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నుంచి నేటి ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకున్న చంద్రబాబు అక్కడ విద్యార్థులు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా చంద్రబాబే తమతో కలిసి అడుగు వేయడంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీలో కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News