: అఫ్ఘాన్ లో అమెరికా విమానాన్ని కూల్చింది మేమే... తాలిబన్ల ప్రకటన
అఫ్ఘానిస్థాన్ లో గత రాత్రి కుప్పకూలిన అమెరికా విమానాన్ని తామే కూల్చేశామని పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. అఫ్ఘాన్ నగరం జలాలాబాదు ఎయిర్ పోర్టు సమీపంలో అమెరికా విమానం కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న మొత్తం 12 మంది దుర్మరణం చెందారని సిన్హూవా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విమానాన్ని తామే కూల్చేశామని తాలిబన్లు ప్రకటించినా, ఎలా కూల్చేశామన్న విషయాన్ని మాత్రం ఆ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదు.