: అదితి మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి ... బాలిక తండ్రికి ఫోన్ చేసి పరామర్శ
విశాఖ చిన్నారి అదితి మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు ఎక్కుతూ అదితి మురుగు కాల్వలో పడి కొట్టుకుపోయింది. ఐదు రోజులుగా విశాఖ మునిసిపల్ సిబ్బందితో పాటు నావికా దళం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో నిన్న ఆ చిన్నారి నిర్జీవంగా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న చంద్రబాబు నేటి ఉదయం అదితి తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేసి తన సంతాపాన్ని ప్రకటించారు.