: ‘పద్మావతి’లో నా మెడికల్ సీటు నాకివ్వకపోతే ఆత్మహత్యే!: విద్యార్థిని బెదిరింపులు


పద్మావతి మెడికల్ కాలేజీలో తనకు రావాల్సిన మెడికల్ సీటును అమ్ముకున్నారని, ఆ సీటు తనకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒక విద్యార్థిని బెదిరింపులకు పాల్పడింది. ఈ సంఘటన కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్ వద్ద గురువారం రాత్రి జరిగింది. కౌన్సెలింగ్ లో తనకు ఈ కళాశాలలో సీటు వచ్చినా, ఇక్కడి అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదంటూ బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, బాధిత విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆమె వివరాలను మాత్రం పోలీసులు బయట పెట్టలేదు.

  • Loading...

More Telugu News