: అది అదితి మృతదేహమేనా?
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం బీచ్ కు గుర్తు తెలియని ఆరేళ్ల చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చింది. చిన్నారి మృత దేహంపై పింక్ కలర్ డ్రెస్ ఉండడం, అదితి కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోల్లో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉండడంతో ఈ మృతదేహం అదితిదే అయి ఉంటుందని భావించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో చిన్నపిల్లల అదృశ్యం కేసులు నమోదు కాకపోవడంతో, ఆ మృతదేహం అదితిదేమోనన్న అనుమానంతో విశాఖ అధికారులకు భోగాపురం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖ అధికారులు మృతదేహం అదితిదా? కాదా? అనేది తేల్చేందుకు, ఆమె కుటుంబ సభ్యులతో పాటు బయల్దేరారు. కాగా, వారం క్రితం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ అదితి డ్రైనేజిలో కొట్టుకుపోయిందంటూ వార్తలొచ్చిన సంగతి విదితమే!