: సికింద్రాబాద్ లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం


సికింద్రాబాద్ లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బౌద్ధనగర్ కు చెందిన నిఖిల్ (9), సందేశ్(9) లు స్నేహితులు. తుకారాం గేట్ సమీపంలోని శాంతినికేతన్ పాఠశాలలో వీళ్లిద్దరూ 5వ తరగతి చదువుతున్నారు. నిన్నరాత్రి నుంచి వాళ్లిద్దరూ కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి కోసం వెతికారు. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. చివరకు.. నిఖిల్, సందేశ్ ల స్నేహితులను అడుగగా వాళ్లిద్దరూ ఉప్పల్ వెళ్తున్నామని తమకు చెప్పినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉప్పల్ ప్రాంతంలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News