: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 5న నామినేషన్లు వేయనుండగా, 6న ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. టీఆర్ఎస్ నేత, ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న నేతి విద్యాసాగర్ మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయన టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతో గతంలో ఆయనకు ఉన్న డిప్యూటీ ఛైర్మన్ పదవినే సీఎం కేసీఆర్ కట్టబెట్టారు.