: తల్లిదండ్రులను చంపి... కోసి కుక్కలకేశారు!
తమ తమ్ముడు, చెల్లి మీద ప్రేమ చూపించడం లేదని భావించిన ఇద్దరు యువతీయువకులు తమ తల్లిదండ్రులను హత్య చేసి, వారి శవాలను ముక్కలుగా కోసి, కుక్కలకు వేసిన ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. బ్యూనస్ ఎయిర్స్ లోని కరెన్ క్లెన్ తల్లి, లియాండ్రో అకోస్టా తండ్రి కలసి వివాహం చేసుకున్నారు. వీరి వివాహ బంధానికి గుర్తుగా వారికి కవలలు పుట్టారు. అయితే, అన్నాచెల్లెళ్ళుగా ఉండాల్సిన కరెన్, లియాండ్రో మధ్య ప్రేమ అంకురించింది. దీనికి తోడు, కవలలను తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదని భావించిన, కరెన్, లియాండ్రో కలసి తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చి చంపారు. అనంతరం వారి శవాలను ముక్కలుగా కోసి కుక్కలకు వేశారు. కుక్కలు తినేయగా మిగిలిన శరీర భాగాలను కాల్చేశారు. ఈ పని చేసినందుకు తమకు బాధగా లేదని, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామని వారు చెబుతుండడం విశేషం!