: టీఆర్ఎస్ అంటే 'తెలంగాణ రాబందుల సమితి': టి.టీడీపీ ఎమ్మెల్యే


నిన్నటి వరకు టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ, నేడది తెలంగాణ దొంగల పార్టీ అని ఎంపీ కవిత చేసిన విమర్శలను టి.టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తిప్పికొట్టారు. టీఆర్ఎస్ అంటే 'తెలంగాణ రాబందుల సమితి'గా మారిందని ఎద్దేవా చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి దిక్సూచిగా ఉన్న నేతలను ఇప్పుడు నిర్బంధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బంగారు పళ్లెంతో ఎంపీ కవిత బతుకమ్మ ఆడినంత మాత్రం బంగారు తెలంగాణ అవ్వదని వివేక్ వ్యాఖ్యానించారు. జాగృతికి కేటాయించే నిధులను ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇవ్వాలన్నారు. కేసీఆర్ బంధువుకు విలువైన భూకేటాయింపులు చేశారని ఆరోపించారు. అల్లుడు, కుమారుడి శాఖలకు నిధులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినందుకు మాది దొంగల పార్టీనా? అని వివేక్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News