: ఆస్తుల ప్రకటనతో చంద్రబాబు దేశానికే ఆదర్శంగా నిలిచారు: రావుల
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబం ప్రకటించిన ఆస్తులపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను టి.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తిప్పికొట్టారు. కుటుంబ ఆస్తులు ప్రకటించి తమ అధినేత చంద్రబాబు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. అందుకే ఆయనపై ఆరోపణలు చేయడం కంటే ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని రావుల హితవు పలికారు. అంతేగాక టీడీపీ దొంగల పార్టీ అని విమర్శించిన టీఆర్ఎస్ వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. టీడీపీ పార్టీ దొంగల పార్టీ అయితే, తమ నేతలను మంత్రులుగా ఎలా తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. సమస్యలపై సమాధానం చెప్పలేకే ప్రభుత్వం సభను వాయిదా వేస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.