: చాలా పద్ధతిగా చెప్పాం... ఇంకెలా చెప్పాలి?: కేటీఆర్
రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ అనంతరం కూడా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్చపై సమాధానాన్ని చాలా పద్ధతిగా చెప్పామని, రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దాదాపు 12 గంటల పాటు ఈ అంశంపై చర్చ జరిగితే, ఆరున్నర గంటల పాటు విపక్షాల ఎమ్మెల్యేలే మాట్లాడారని, వారి మాటలను తాము ఓపికతో వింటే, తాము చెప్పినదాన్ని ప్రతిపక్షాలు వినకుండా డొల్లగా వాదిస్తున్నాయని విమర్శించారు. వీరి తీరు శవాలపై పేలాలను ఏరుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కారుకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటాన్ని చూసి తట్టుకోలేక రోడ్లెక్కి రచ్చ చేస్తున్నారని అన్నారు.