: బీహార్ ఎన్నికలకు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన బీజేపీ
బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విజన్ డాక్యుమెంటును విడుదల చేసింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆ డాక్యుమెంట్ ను ఢిల్లీలో విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను పెంచుతామని, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యమని జైట్లీ తెలిపారు. తమ ఎన్నికల మేనిఫెస్టో బీహార్ కు అభివృద్ధి ప్రణాళిక అని చెప్పారు. బీహార్ లో పేదరికాన్ని రూపుమాపుతామని పేర్కొన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు బీహార్ లో రాజకీయ అస్థిరతను సృష్టించాయని మండిపడ్డారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ మూడు పార్టీలు చేసేందేమి లేదన్నారు. మొత్తం ఐదు దశల్లో ఆ రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా, తొలిదశ ఎన్నిక ఈ నెల 12న జరగనుంది.