: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవ పూజా టికెట్లు
విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు బెజవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణమ్మ తీరాన కొండపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యేందుకు తెలుగు ప్రజలు అమితాసక్తి కనబరుస్తారు. దీంతో శరన్నవరాత్రులు సమీపిస్తున్నాయంటే కనకదుర్గమ్మ గుడిలో భారీ ఏర్పాట్లు సిద్ధమవుతాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో శరన్నవరాత్రి సందర్భంగా జరిపించుకునే ప్రత్యేక పూజల కోసం ఆలయ కమిటీ జారీ చేసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. టికెట్ల విక్రయం ప్రారంభించిన గంట వ్యవధిలోనే 3 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.