: బళ్లారి వెళ్లేందుకు అనుమతివ్వండి... సుప్రీంను ఆశ్రయించిన గాలి


బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ ఓబుళాపురం మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మైనింగ్ కేసుల్లో కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న గాలి, తరువాత బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే కోర్టు ఆయనను బెంగళూరులోనే ఉండాలని షరతు విధించింది. ఈ క్రమంలో తాజాగా బళ్లారి వెళ్లేందుకు సుప్రీం అనుమతి కోరారు.

  • Loading...

More Telugu News