: ఏపీలోనూ నిరుద్యోగుల ఆందోళన బాట... చంద్రబాబు క్యాంపు ఆఫీస్ ను ముట్టడించిన వైనం
కొత్త రాష్ట్రం తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్ లోనూ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఖాళీగా ఉన్న సర్కారీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయాన్ని నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ముట్టడించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వైపు కేబినెట్ సమావేశం జరుగుతుండగానే క్యాంపు కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.