: ఆరు వేల మందితో టెలి కాన్ఫరెన్స్... చంద్రబాబు రికార్డ్!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చేసినా పక్కా ప్రణాళికతో, భారీ ఎత్తున చేస్తారు. తాజాగా, ఈ రోజు ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఒకేసారి 6 వేల మందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి 'ఔరా' అనిపించారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన కాన్ఫరెన్స్ సందర్భంగా ఇది జరిగింది. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్వహణ కోసం ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ స్మార్ట్ గ్రామాలుగా మార్చుకుందామని చెప్పారు. సమాజం ఎదిగినప్పుడే నిజమైన ప్రగతి అని తెలిపారు.

  • Loading...

More Telugu News