: 'పులి' గర్జిస్తోంది... ట్విట్టర్ లో హన్సిక... 'కీప్ కామ్' అంటూ విజయ్ మొట్టికాయ!


ఎట్టకేలకు ఒక గంట ఆలస్యంగా 'పులి' చిత్రం విడుదలైంది. బెనిఫిట్, ప్రీమియర్ షోలన్నీ రద్దుకాగా, ఆపై సమస్యలన్నీ తొలగాయని చిత్ర హీరోయిన్ హన్సిక తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. మధురై, సేలం తదితర ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన మొదలైందని చెబుతూ, థియేటర్లో తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. 'పులి గర్జిస్తోంద'ని వ్యాఖ్యానించిన ఆమె ఉత్సాహానికి విజయ్ బ్రేక్ వేశాడు. "కీప్ కామ్, నెవర్ గివప్" (సైలెంట్ గా ఉండు, ఎప్పుడూ బయటపడొద్దు) అని రీట్వీట్ చేస్తూ మొట్టికాయ వేశాడు. కాగా, ఇంకా పలు థియేటర్లలో చిత్ర ప్రదర్శన ప్రారంభం కాలేదని సమాచారం. ఇదిలావుండగా, పలు వెబ్ సైట్లు చిత్రం 'లైవ్ రివ్యూ'లను ఇస్తున్నాయి. ఈ సినిమాలో కొంత భాగం హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్రేవ్ హార్ట్' నుంచి ప్రేరణతో తీసినట్టుందని, విజువల్ ఎఫెక్టులు బాహుబలి కన్నా బాగున్నాయని, తొలి సగం నిదానంగా సాగిందని, విజువల్ వండర్ లా వుందని ట్వీట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News