: అరెస్ట్ పై స్టే... హైకోర్టులో హిమాచల్ సీఎంకు ఊరట


ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు ఊరట లభించింది. ఇప్పటికే పలు అభియోగాల కింద కేసు నమోదు చేేసిన సీబీఐ వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే తన అరెస్ట్ కు సంబంధించి సీబీఐ అధికారులను నిలువరించాలని వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కొద్దిసేపటి క్రితం ఆయనకు ఊరటనిచ్చేలా తీర్పు చెప్పింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే దాకా వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ధర్మాసనం సీబీఐకి సూచించింది.

  • Loading...

More Telugu News