: ఇక 100, 108 ఉండవు... ఇండియాలో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఇదే!
అమెరికాలో అమలవుతున్న సింగిల్ ఎమర్జన్సీ కాంటాక్ట్ నంబర్ '911' తరహాలో ఇండియాలో అత్యవసర పరిస్థితులన్నింటిలో ఒకే నంబరు వాడకం త్వరలో అమలు కానుంది. ఇండియాలో అత్యవసర నంబరుగా '112'ను వాడాలన్న ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రతిపాదనలకు డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) ఆమోదం తెలిపింది. ఈ నంబరు విధానం అమలైతే పోలీసులు వాడుతున్న 100 నుంచి వైద్య సేవలకు వాడుతున్న 108, ఫైర్ తదితర విభాగాలకు వాడుతున్న 101, 102 వంటి నంబర్లన్నీ తొలగిపోతాయి. అయితే, 112 ప్రజల్లో పాప్యులర్ అయ్యే వరకూ, కనీసం ఒక సంవత్సరం పాటు మిగతా అన్ని ఫోన్ నంబర్లనూ కొనసాగిస్తామని డాట్ తెలిపింది. ఆపై దశలవారీగా వీటిని తొలగిస్తామని పేర్కొంది. 112 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేదీ త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది.