: ఆ విషయాన్ని నిరూపించండి... రాజీనామా చేస్తా: నాయిని


హైదరాబాద్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు బాగాలేవని ఎవరైనా నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో నాయిని మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయాల్లో... సెల్ ఫోన్లలో పేకాట ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పెట్రోలింగ్ వాహనాలు ఎక్కినప్పుడు, పోలీసులు తమ ఫోన్లను సరెండర్ చేస్తారని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసులను అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం చైన్ స్నాచింగ్ ఘటనలు తగ్గాయని నాయిని తెలిపారు. కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. నగరంలో రద్దీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఉంచామని తెలిపారు.

  • Loading...

More Telugu News