: పేకాట క్లబ్బులపై టీ మండలిలో రభస...పరస్పర ఆరోపణలు గుప్పించుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్


రైతుల రుణమాఫీపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగితే, శాసన మండలిలో మాత్రం పేకాట క్లబ్బుల విషయంపై రభస చోటుచేసుకుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీల మధ్య పేకాట క్లబ్బులపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘పత్తాలు ఆడించి డబ్బులు సంపాదించారు’’ అన్న ఆరోపణలపై షబ్బీర్ అలీ అంతెత్తున ఎగిరిపడ్డారు. నగరంలో ఎవరికి ఎన్ని పేకాట క్లబ్బులు ఉన్నాయో తేల్చుకుందాం రండి అంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీనికి ఘాటుగా స్పందించిన మంత్రి హరీశ్ రావు హైదరాబాదు నగరంతో పాటు శివార్లలోనూ పేకాటను పెంచి పోషించిన ఘనత కాంగ్రెస్ దేనంటూ తిప్పికొట్టారు. పేకాట క్లబ్బులపై ఇరువురు నేతలు పెద్దగా అరుస్తూ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో మిగిలిన సభ్యులు కిమ్మనకుండా కూర్చున్నారు.

  • Loading...

More Telugu News