: తెలంగాణ విపక్ష ఎమ్మెల్యేల అరెస్ట్... నాంపల్లి పీఎస్ కు తరలింపు


నిన్నటిదాకా అర్థవంత చర్చకు వేదికగా నిలిచిన తెలంగాణ అసెంబ్లీ నేటి ఉదయం నిరసనలు, వాయిదాలకు కేంద్ర బిందువుగా మారింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడ్డ సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఏకంగా సోమవారానికి వాయిదా వేశారు. సభను ఆకస్మికంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు పబ్లిక్ గార్డెన్స్ ఎదుట నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలనందరినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News