: తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 5కు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ ఏకంగా ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అంతకుముందు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. అనంతరం చేపట్టిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోగ్య లక్ష్మి పథకంపై మాట్లాడుతుండగా సభ్యులు వినిపించుకోకుండా గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభా సమావేశాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.