: తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు... ఏ పార్టీ, ఏ అంశం మీదంటే...!


తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలపైనే చర్చ జరిగింది. దీంతో నిన్న, మొన్న విపక్షాల వాయిదా తీర్మానాల అంశం అంతగా ప్రస్తావనకు రాలేదు. నేటి సభలో విద్యుత్ అంశంపై చర్చిద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని చెప్పిన విపక్షాలు నేటి సమావేశాలకు సంబంధించి పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు అరెస్ట్ పై చర్చ కోసం టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్యేలపై దాడులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై చర్చకోసం కాంగ్రెస్ ప్రతిపాదించింది. వరంగల్ ఎన్ కౌంటర్, చలో అసెంబ్లీపై పోలీసుల ఉక్కుపాదం అంశాలపై సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై ఎంఐఎం, జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై బీజేపీలు వాయిదా తీర్మానాలిచ్చాయి.

  • Loading...

More Telugu News