: సమంత మాకేమీ ఇవ్వదు... ఇంటికొస్తుందంతే!: తల్లిదండ్రుల ఆవేశం
చెన్నైలో హీరోయిన్ సమంత ఉన్న అపార్టుమెంట్ల సముదాయంలోనే మరో ఫ్లోర్ లో ఉండే ఆమె తల్లిదండ్రులు ఆదాయపు పన్ను అధికారులపైనా, కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా చిందులు తొక్కారు. ఐటీ అధికారులు దాడుల నిమిత్తం వెళ్లినప్పుడు సమంత తండ్రి జోసఫ్ ప్రభు అడ్డుకునేందుకు యత్నించారు. తమ కుమార్తె డబ్బు, నగలు, డాక్యుమెంట్లు తదితరాలను తమకు ఇవ్వదని, అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళుతుందని ఆవేశంగా వాదించారు. తామే అద్దె ఇంటిలో నివసిస్తున్నామని అన్నారు. సమంత షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉందని వారు తెలిపారు. సమంత తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయని అధికారులు, వారింట్లో సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. కాగా, నిన్న 'పులి' చిత్ర నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్ల ఇళ్లపై, నటి నయనతార ఇళ్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే.