: స్వల్పంగా పెరిగిన డీజిల్ ధర... పెట్రోల్ ధరలో మార్పు లేదు!
ఇటీవలి కాలంలో ఇంధన ధరలు పెరిగినా, తరిగినా... డీజిల్ తో పాటు పెట్రోల్ ధరలు కూడా మారడం సర్వ సాధారణం అయింది. అయితే, అందుకు భిన్నంగా ఈ దఫా వాటిలో ఒకదాని ధర పెరగగా, మరో దాని ధర మాత్రం యథాతథంగా ఉండిపోయింది. గడచిన అర్ధరాత్రి నుంచి డీజిల్ ధర లీటరుకు 50 పైసల వంతున పెరిగింది. అయితే పెట్రోల్ ధరలను మాత్రం చమురు సంస్థలు పెంచలేదు. సవరించిన ధరల ప్రకారం హైదరాబాదులో లీటరు డీజిల్ ధర రూ.48.90 కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పెరుగుదలే తాజా పెంపునకు కారణమట. పెట్రోల్ ధరలను కూడా భారీగానే పెంచాల్సి ఉన్నా, బీహార్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఇంధన ధరలపై ఆచితూచి అడుగేసినట్లు తెలుస్తోంది.