: హిజాబ్ కు మోడల్ గా మొట్టమొదటి పాకిస్తానీ అమ్మాయి


ముస్లిం యువతులు జుట్టు కనిపించకుండా చుట్టుకొనే వస్త్రాన్ని హిజాబ్ అని పిలుస్తారు. హెచ్ అండ్ ఎమ్ అనే లండన్ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. వీటికి మోడల్ గా ఒక పాకిస్తానీ అమ్మాయిని ఈ కంపెనీ వారు సెలక్టు చేసుకున్నారు. ఈ అమ్మాయి పేరు మరయ్యా ఈద్రిసీ. హిజాబ్ కు మోడల్ గా ఉన్న మొట్టమొదటి పాకిస్తానీ ఈ అమ్మాయే. ఆమె ప్రస్తుతం లండన్ లో ఒక హెన్నా సెలూన్ ని నిర్వహిస్తోంది. మరయ్యా కుటుంబం చాలా ఏళ్ల కిందట లండన్ కు వచ్చి స్థిరపడింది. ఈ బ్రాండ్ మోడలింగ్ చేయాలంటే పురుషులెవ్వరూ తమ కూతురిని తాకరాదని ఆమె తల్లిదండ్రులు షరతు పెట్టారట. ఈ షూటింగ్ లో పాల్గొనేది కేవలం ఆడవాళ్లేనని, ఎటువంటి ఇబ్బంది ఉండదని సదరు సంస్థ వాళ్లు హామీ ఇచ్చిన తర్వాతే మరయ్యా తల్లిదండ్రులు అంగీకరించారట.

  • Loading...

More Telugu News