: ఉదయం అసెంబ్లీ చుట్టూ... ఇప్పుడు అసెంబ్లీలో మార్షల్స్


తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో నేడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ అయిన శృతికి మద్దతుగా ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో నేటి ఉదయం అసెంబ్లీ పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించిన అధికారులు, ఆందోళన కారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి తరలించారు. కాగా, నేటి అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ చేపట్టిన ప్రభుత్వం, వారికి ఊరట కలిగించేలా ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపిస్తూ ఎంఐఎం మినహా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రైతు రుణమాఫీ ఏకకాలంలో చెల్లిస్తామంటూ తక్షణం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో అసెంబ్లీ వద్ద భారీ స్థాయిలో మార్షల్స్ ను మోహరించారు. శాసన సభ్యులను అసెంబ్లీ హాల్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు మార్షల్స్ ప్రయత్నిస్తున్నారు. వారిని వాహనాల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కాగా, మార్షల్స్ ప్రయత్నాన్ని శాసనసభ్యులు ప్రతిఘటిస్తున్నారు.

  • Loading...

More Telugu News