: రుణమాఫీపై ప్రకటన చేసే వరకు అసెంబ్లీలోనే పడుకుంటాం: విపక్షాలు


రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు అసెంబ్లీని విడిచి వెళ్లేది లేదని విపక్షాలు పట్టుబట్టాయి. రుణమాఫీ సింగిల్ సెటిల్ మెంట్ పై ప్రకటన చేయాలంటూ అసెంబ్లీలో ఎంఐఎం మినహా మిగిలిన పార్టీలన్నీ బైఠాయించాయి. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే, రెండు రోజుల చర్చలో ప్రభుత్వం రైతులకు ఏ రకంగా ఊరట కలిగించిందని వారు నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం విత్తన సబ్సిడీని కుదించింది, కరెంటు అడిగితే వచ్చే సంవత్సరం పగలు ఇస్తామంటారు, పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు, ఇలా అన్ని రకాలుగా రైతులను వేధిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. కనీసం రుణమాఫీ ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తే కానీ అసెంబ్లీని వీడేది లేదని, ఇక్కడే పడుకుంటామని విపక్ష సభ్యులు స్పష్టం చేశారు. అలాగే రేపటి సభను కూడా అడ్డుకుంటామని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తెలిపారు.

  • Loading...

More Telugu News