: అక్రమ హోర్డింగ్ లు తొలగించండి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు


ఢిల్లీ పట్టణ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ బాదర్ దురేజ్ అహ్మద్, సంజీవ్ సచ్ దేవ్ లతో కూడిన ధర్మాసనం బుధవారం నాడు ఈ మేరకు పురపాలక సంఘ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2007 అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ పాలసీని అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్ ప్రకటనలకు సంబంధించి ఉన్న అక్రమహోర్డింగ్ లను రెండు నెలల్లోగా తొలగించాలని పేర్కొంది. హోర్డింగ్ ల విషయమై పలువురు వ్యక్తిగత పిటీషన్లు పెట్టిన నేపథ్యంలో వాటిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News