: వరంగల్ ఎన్ కౌంటర్ పై కేసీఆర్ కు వివరిస్తా: ఎంపీ కవిత


ఉద్యమంలో ఒక పంథాలో వెళ్లిన బిడ్డ మృతి చెందడం చాలా దురదృష్టకరమంటూ వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన శ్రుతి ఎన్ కౌంటర్ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రస్తావించారు. ఈ అంశాన్ని కేసీఆర్ కు వివరిస్తానని ఆమె చెప్పారు. ఎన్ఎస్సీడీసీ సహకారంతో వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, తెలంగాణ జాగృతి జిల్లా కార్యాలయాన్ని ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ఆమె ప్రారంభించారు. తెలంగాణ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం హన్మకొండలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మహాసభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీలపై ఆమె మండిపడ్డారు. పట్టపగలు ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయిన దొంగలకు ఆ పార్టీ అధినేత పదవులు కట్టబెట్టారని ఆమె విమర్శించారు. ఎర్రజెండా పార్టీలు ఇంకా తోక పార్టీలుగానే ఉన్నాయన్నారు. ప్రధాని మోదీపై కూడా ఆమె విమర్శల వర్షం కురిపించారు. మోదీ విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన రైతు సమస్యలు, ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం కావన్నారు.

  • Loading...

More Telugu News