: పాఠశాలలో పాలు తాగిన విద్యార్థులకు అస్వస్థత
పాఠశాలలో పాలు తాగిన 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఖైరాగఢ్ లో చోటుచేసుకుంది. మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా విద్యార్థుల కోసం ఈ పాలను సరఫరా చేశారు. పాలు తాగిన కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. 12 అంబులెన్స్ ల ద్వారా బాధిత విద్యార్థులను ఆసుపత్రులకు తరలించారు. 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బుధవారం నాడు జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాల శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపారు. అయితే, పాఠశాలకు పాలు సరఫరా చేసే వ్యక్తి పరారైనట్లు సమాచారం.