: అంతర్వేదిలో డ్రెజ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, అంతర్వేదిలో డ్రెజ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రూ.1800 కోట్ల వ్యయంతో ఈ హార్బర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నౌకాయాన సంస్థ లేఖ రాసింది. డ్రెజ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు ముంబై, మంగళూరు, అంతర్వేది ప్రాంతాలను మొదట కేంద్ర నౌకాయాన సంస్థ గుర్తించింది. చివరికి అంతర్వేది ప్రాంతం అనుకూలంగా ఉందని, స్థలాన్ని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించగా స్థల పరిశీలనకు కేంద్ర బృందం అక్టోబర్ 3న అంతర్వేదికి రానుంది. హార్బర్ లో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్, వర్క్ షాప్ తో పాటు ఇతర సంస్థలను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. అంతర్వేది కేంద్రంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలు నిర్వహించనుంది.

  • Loading...

More Telugu News