: ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలన్న వ్యాజ్యం కొట్టివేత
ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం... అది సరైనదేనని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల అంశంపై రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈలోగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉపాధ్యాయుల సర్వీసులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.