: బీమర్, హార్లీడెవిడ్ సన్...రోజుకో బైక్ ఎక్కేస్తున్నా: షారూఖ్
రోహిత్ శెట్టి వల్ల రోజుకో బైక్ డ్రైవ్ చేస్తున్నానని షారూఖ్ తెలిపాడు. ముంబై, రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లలో షారూఖ్ కొత్త సినిమా 'దిల్ వాలే' షూటింగ్ జోరుగా సాగుతోంది. షూటింగ్ లో పాల్గొనేందుకు సెట్ లో రోహిత్ శెట్టి రోజుకో బైక్ పంపుతున్నారని, బీమర్, హార్లీ డెవిడ్ సన్ ఇలా కొత్త బైక్ లు రైడ్ చేస్తున్నానని షారూఖ్ తెలిపాడు. సెట్ లో నడవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాడని షారూఖ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.