: రాహుల్ గాంధీ, డిగ్గీలపై బీజేపీ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ మహిళా నేత సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ఆమె విమర్శలు చేశారు. రాహుల్ రాజకీయాలకు పనికిరాడని, ఆ విషయం ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా తెలుసునని ఉత్తరప్రదేశ్ లో ని గోరఖ్ పూర్ లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ ని బీహార్ ఎన్నిక సమయంలో అమెరికా పర్యటనకు పంపారని విమర్శించారు. ఇటీవల యాంకర్ అమృతా రాయ్ ను పెళ్లి చేసుకున్న దిగ్విజయ్ విషయంపై ప్రాచీ మాట్లాడుతూ, ఈ వయసులో పెళ్లి చేసుకున్న ఆయన... కొడుకుతో ఆడుకుంటారా... మనవళ్లతో ఆడుకుంటారా? అని డిగ్గీని ఎద్దేవా చేశారు. మరీ వ్యాఖ్యలకు రాహుల్, దిగ్విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.