: నాజీల బంగారం రైలు జాడ లేదుగానీ, టూరిస్టులు మాత్రం వెల్లువెత్తుతున్నారు!


ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించిన వార్తల్లో 'నాజీల బంగారం రైలు దొరికింది' అన్నది ఒకటి. రష్యాలోని ఓ ప్రాంతం నుంచి అపహరించిన బంగారం, విలువైన ఆభరణాలు, వజ్రాలతో కూడిన ఓ రైలును కొండ గుహల మధ్య తాము కనుగొన్నామని కొందరు ప్రకటించారు. ఈ విషయంలో గోల్డ్ ట్రైన్ ఎక్కడో ఒకచోట ఉందని నమ్ముతున్న వారి సంఖ్యే అత్యధికం. అదే పోలెండ్ కు ఇప్పుడు 'బంగారు' వరమైంది. దేశ విదేశాల నుంచి ఈ రైలు ఉందని భావిస్తున్న ప్రాంతానికి వేలకొద్దీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ రైలు ఎక్కడుందో ఇప్పటికైతే బయట పడలేదుగానీ, రైలు దాగుండవచ్చని భావిస్తున్న పర్వత ప్రాంతాల వద్ద కొత్త రిసార్టులు, కొత్త కొత్త హోటళ్లు ఎన్నో వెలిశాయి. వస్తున్న పర్యాటకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో అక్కడ సెక్యూరిటీని సైతం పెంచాల్సి వచ్చింది. వందల సంఖ్యలో ప్రజలు పోలెండ్ లోని కొండ గుహలు, బొగ్గు గనుల సొరంగాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరిపై నిఘా పెడుతూ, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ రైలు దాగుందని భావిస్తున్న వాల్బర్జిచ్ పట్టణం సమీపంలోని కొండల వద్ద టూరిస్టుల తాకిడి అధికంగా ఉంది. ఏదిఏమైనా, నాజీల గోల్డ్ రైల్ సంగతేమో కానీ, దీని వల్ల తమకు వస్తున్న ఆదాయం పెరిగిందని ఆ ప్రాంతంలోని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News