: తిరుమలలో ప్రముఖుల లేఖలతో మోసగిస్తున్న ఐదుగురు దళారుల అరెస్టు
తిరుమలలో ప్రముఖుల లేఖలతో భక్తులను మోసగిస్తున్న ఐదుగురు దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. సుప్రభాత టికెట్లు ఇప్పిస్తామంటూ బెంగళూరు భక్తుల నుంచి దళారులు రూ.13వేలు తీసుకున్నారు. తీరా టిక్కెట్లు ఇవ్వకపోవడంతో భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... నిజామాబాద్ కు చెందిన భక్తులకు కూడా టికెట్లు విక్రయించినట్టు తెలిసింది. గదులకు, ఆరు వీఐపీ టికెట్ల కోసం వారి నుంచి కూడా రూ.20వేలు తీసుకున్నట్టు దళారులు తెలిపారు.